
రత్నగిరి , 20 మార్చి (హి.స.)జిల్లాలోని ముంబాక్ గ్రామంలో ఉన్న ఈ నాలుగు భూములు గతంలో దావూద్ తల్లి అమీనా బీ పేరు మీద నమోదై ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ‘స్మగ్లర్లు & విదేశీ మారక ద్రవ్య మానిప్యులేటర్ల (ఆస్తి జప్తు) చట్టం’ కింద 2026 మార్చి 5న ఈ వేలాన్ని నిర్వహించింది. అత్యధిక బిడ్ వేసిన వ్యక్తి 2026 ఏప్రిల్ మొదటి వారం నాటికి పూర్తి మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నిధుల జమ అనంతరం, సంబంధిత అధికారుల నుంచి తుది ఆమోదం పొందిన తర్వాతే ఆస్తి బదిలీ ప్రక్రియ పూర్తవుతుంది.
ఈ వేలంలో ప్రధానంగా సర్వే నెం. 442 (పార్ట్ 13-బి) ప్లాట్ గురించి ఆసక్తికర చర్చ నడిచింది. దీని రిజర్వ్ ధర సుమారు రూ.9.41 లక్షలుగా నిర్ణయించగా, వేలంలో ఇది రూ.10 లక్షల మార్కును దాటింది. ఈ ప్లాట్ కోసం ముంబై, రత్నగిరి నుంచి ఇద్దరు బిడ్డర్లు పోటీ పడగా, మిగిలిన మూడు ప్లాట్లను ఒకే బిడ్డర్ దక్కించుకున్నారు.
దావూద్ ఆస్తులను వేలం వేయడానికి గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, అవి పదేపదే విఫలమవుతూ వచ్చాయి. దావూద్ ఇబ్రహీం, అతని ముఠా (D-Company) భయంతో కొనుగోలుదారులు ముందుకు రావడానికి వెనుకాడారు. ఇదే సమయంలో గత నవంబర్ (2025)లో ప్రభుత్వం ధరను 30 శాతం తగ్గించినప్పటికీ ఎవరూ ఆసక్తి చూపలేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ