కేరళ సీఎం విజయన్ ఆస్తులు కోటిపైనే..
తిరువనంతపురం: , 20 మార్చి (హి.స.)కేరళలో శాసనసభ ఎన్నికల్లో పోటీచేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన స్థిరచరాస్తులకు సంబంధించిన అఫిడవిట్ను ఎన్నికల సంఘం అధికారులకు సమర్పించారు. దీని ప్రకారం విజయన్ పేరిట పథిరియాద్ ఆమ్సమ్లో 78 సెంట్ల
కేరళ సీఎం విజయన్ ఆస్తులు కోటిపైనే..


తిరువనంతపురం: , 20 మార్చి (హి.స.)కేరళలో శాసనసభ ఎన్నికల్లో పోటీచేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన స్థిరచరాస్తులకు సంబంధించిన అఫిడవిట్ను ఎన్నికల సంఘం అధికారులకు సమర్పించారు. దీని ప్రకారం విజయన్ పేరిట పథిరియాద్ ఆమ్సమ్లో 78 సెంట్ల వ్యవసాయ భూమి, ఒక నివాస స్థలం సహా రూ.45 లక్షల విలువైన చరాస్తులున్నాయి.

విజయన్ భార్య పేరిట 80 గ్రాముల బంగారం సహా రూ.60 లక్షలకుపైగా విలువైన చరాస్తులు ఉన్నాయి. ఈమె పేరిట రూ.36 లక్షల విలువైన స్థిరాస్తులున్నాయి. ఈయన 2024–25లో రూ.5.33 లక్షల ఆదాయం సంపాదించారు. భార్య ఇదే కాలంలో రూ.5.77 లక్షల ఆదాయం సంపాదించారు. కాగా, కేరళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 9న జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడతాయి.

39 మందితో కేరళ బీజేపీ రెండో జాబితా

కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 39 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను బుధవారం విడుదల చేసింది. ఆరన్ముళ నియోజకవర్గం నుంచి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మిజోరం మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ను బరిలోకి దింపింది. ఈ సీనియర్ నాయకుడు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్తో తలపడనున్నారు. 2021లో నేమోం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాజశేఖరన్ ప్రస్తుత విద్యాశాఖ మంత్రి వి.శివన్కుట్టి చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం నేమో నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande