
హైదరాబాద్, 24 మార్చి (హి.స.) రాష్ట్రంలో ద్రోణి బలహీనపడినప్పటికీ, సముద్రం నుంచి వస్తున్న తేమగాలుల ప్రభావం వల్ల రాబోయే ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. అయితే ఇదే సమయంలో పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరగనుండటం గమనార్హం.
సముద్రం నుంచి వీస్తున్న తేమగాలుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర , దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు కురిసే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. మొదటి మూడు రోజులు గాలి వేగం గంటకు 30 నుండి 40 కిలోమీటర్లు ఉండగా, నాలుగో రోజు తర్వాత ఈదురుగాళ్ల ఉధృతి పెరిగి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు