
ములుగు, 26 మార్చి (హి.స.)
జిల్లాలో ఎక్కడ గ్యాస్ పెట్రోల్ కొరత లేదని, పూర్తి స్థాయిలో నిలువలు ఉన్నాయని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తెలిపారు. గురువారం ఆయన జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇప్పటికే డీలర్లతో మాట్లాడి నిత్యం పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా చేసే విధంగా చర్చలు జరపడం జరిగిందని, సివిల్ సప్లై కమిషనర్ సైతం జిల్లాకు పూర్తి స్థాయిలో సరఫరా చేస్తున్నారని అన్నారు. వీటి విషయంలో జిల్లా ప్రజలు ఆందోళన చెందవద్దని, అపోహలు నమ్మకుండా ఉండాలని సూచించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెట్లో నిలువలు చేసి అమ్మకం చేసిన పక్షంలో కఠిన చర్యలు తప్పవని, కొందరు తెలిసి తెలియని తప్పులు చేస్తూ ఉంటారని అన్నారు. జిల్లాలో ఎలాంటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..