జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. పుకార్లు పుట్టిస్తే కఠిన చర్యలు.. సంగారెడ్డి ఎస్పి
సంగారెడ్డి, 26 మార్చి (హి.స.) పెట్రోలు, డీజిల్ కొరత ఉందని సోషల్ వదంతులను మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా కొందరు అసత్య ప్రచారాలను పోస్టులు చేస్తూ లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నారు. దీనిపై సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సీరియస్ అయ్యారు. ప్రజలను
ఎస్పీ


సంగారెడ్డి, 26 మార్చి (హి.స.)

పెట్రోలు, డీజిల్ కొరత ఉందని సోషల్

వదంతులను మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా కొందరు అసత్య ప్రచారాలను పోస్టులు చేస్తూ లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నారు. దీనిపై సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సీరియస్ అయ్యారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎవరైనా అసత్య ప్రచారాలు, వదంతులను సృష్టించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలు నమ్మి అనవసరంగా ఆందోళన చెందవద్దని, అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేయడం లేదా నిల్వచేయడం చేయవద్దని సూచించారు. ఇలాంటి చర్యలు ఇతరులకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని తెలిపారు. ఇకపోతే ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు ఎటువంటి అనుమానాస్పద సమాచారాన్ని గమనించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా పోలీస్ కంట్రోల్ నెంబర్ 8712656739 కు సమాచారం అందించాలని, తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయకూడదని సూచించారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించి సమాజంలో శాంతి భద్రతలను కాపాడడంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande