
గోదావరిఖని, 26 మార్చి (హి.స.)
ఆసుపత్రి అవసరమైన పరికరాల
ప్రతిపాదనలు వెంటనే అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం రామగుండం జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ విభాగాలను, క్రిటికల్ కేర్ సెంటర్, ఎస్.ఎన్.సి.యూ, ఎక్స్ రే ఏరియా, అల్ట్రా సౌండ్, చిన్న పిల్లల విభాగం, ఫిజియోథెరపీ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆసుపత్రికి అవసరమైన పరికరాల కోసం ప్రతిపాదనలు సమర్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు