రాయపూడి ఘటన.. ప్రమాదమా, కుట్రకోణమా.. విచారణ చేయండి: సీఎం
రాజధాని అమరావతిలోని ప్రాంతం రాయపూడిలో నిన్న(సోమవారం) రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఈరోజు(మంగళవారం) రివ్యూ నిర్వహించారు. రాయపూడిలో హెచ్వోడీ టవర్ల నిర్మాణం వద్ద మెగా సంస్థకు చెందిన ప్లాస్టిక్
Rayapudi


అమరావతి, 24 మార్చి (హి.స.)రాజధాని అమరావతిలోని ప్రాంతం రాయపూడిలో నిన్న(సోమవారం) రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఈరోజు(మంగళవారం) రివ్యూ నిర్వహించారు. రాయపూడిలో హెచ్వోడీ టవర్ల నిర్మాణం వద్ద మెగా సంస్థకు చెందిన ప్లాస్టిక్ పైపులు రాత్రి దగ్ధమైన ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

రాజధాని ప్రాంతంలో తరుచూ అగ్రిప్రమాదాలు జరగడంపై సీఎం అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రమాదమా, కుట్రకోణం ఉందా అనే విషయంలో సమగ్ర విచారణ జరపాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మూడు ఘటనల్లో వివిధ కాంట్రాక్టు సంస్థలకు చెందిన నిర్మాణ సామగ్రి దగ్ధమైందని తెలిపారు. ఈరోజు సాయంత్రం సీఆర్డీఏ అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande