ఢిల్లీలో హై అలర్ట్.. ప్రధాని, కేంద్ర మంత్రులకు బాంబు బెదిరింపులు
ఢిల్లీ, 24మార్చి (హి.స.) : ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులకు ఈరోజు(మంగళవారం) బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆగంతకులు మెయిల్‌లో బెదిరించారు. ఈమెయిల్ బీజేపీ నేత విజేందర్ గుప్తాకు రావడం గమనార్హం. దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్న నాయకుల
ఢిల్లీలో హై అలర్ట్.. ప్రధాని, కేంద్ర మంత్రులకు బాంబు బెదిరింపులు


ఢిల్లీ, 24మార్చి (హి.స.) : ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులకు ఈరోజు(మంగళవారం) బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆగంతకులు మెయిల్‌లో బెదిరించారు. ఈమెయిల్ బీజేపీ నేత విజేందర్ గుప్తాకు రావడం గమనార్హం. దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్న నాయకుల పేర్లను ప్రస్తావిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. బెదిరింపు సమాచారం అందిన వెంటనే ఢిల్లీ పోలీసులు, బాంబు స్క్వాడ్ అప్రమత్తమయ్యాయి.

అగ్రనేతలకు బాంబు బెదిరింపులు..

ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, మంత్రి మంజిందర్ సింగ్ సిర్సాల పేర్లను ఈ ఈమెయిల్‌లో ఆగంతకులు ప్రస్తావించారు. ఈ నేతలందరికీ హాని తలపెడతామని లేదా వారి కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుంటామని ఈమెయిల్‌లో ఆగంతకులు పేర్కొన్నట్లు సమాచారం. ఈ మెయిల్ రావడంతో కేంద్ర ఇంటెలిజన్స్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రధాని, కేంద్రమంత్రుల నివాసాల దగ్గర తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande