సీనియర్ ఐపీఎస్ ఎస్ ఆర్ ఆంజనేయులు కు హై.కోర్టు బెయిల్ మంజూరు
అమరావతి, 25 మార్చి (హి.స.) :ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడడంతోపాటు నిధులు దుర్వినియోగం చేశారన్న కేసులో నిందితుడు సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పిటిషనర్ మెడికల్
సీనియర్ ఐపీఎస్ ఎస్ ఆర్ ఆంజనేయులు కు హై.కోర్టు బెయిల్ మంజూరు


అమరావతి, 25 మార్చి (హి.స.)

:ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడడంతోపాటు నిధులు దుర్వినియోగం చేశారన్న కేసులో నిందితుడు సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పిటిషనర్ మెడికల్ బెయిల్పై బయట ఉన్నారని కోర్టు గుర్తుచేసింది. విజయవాడ కోర్టు సంతృప్తి మేరకు రూ.20 వేలతో కూడిన రెండు పూచీకత్తులు సమర్పించాలని పిటిషనర్ను ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రతి 2, 4వ ఆదివారం సంబంధిత ఎస్హెచ్వో ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఈ నెల 17న తీర్పు ఇచ్చారు. కాగా, ఈ కేసులో పీఎ్సఆర్ ఆంజనేయులు(ఏ1)గా ఉన్నారు. అయితే నటి కాదంబరి జత్వానీ కేసులోనూ పీఎ్సఆర్ను పోలీసులు తొలుత అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. అనంతరం గ్రూప్-1 కేసులో పీటీ వారెంట్పై ఆయనను విజయవాడ కోర్టులో హాజరుపరచగా పీఎ్సఆర్కు రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆయన మెడికల్ బెయిల్పై ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande