రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. టికెట్ క్యాన్సిల్ చేసుకుంటున్నారా? ఇక కొత్త రూల్స్!
ఢిల్లీ, 25 మార్చి (హి.స.)భారత రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. రైలు బయలుదేరే సమయాన్ని ఆధారంగా చేసుకుని రిఫండ్ విధానాన్ని సవరించింది. ఈ కొత్త మార్పులను రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రకటించారు. ఈ విధానం ఏప్రిల్ 1 నుంచి
Train


ఢిల్లీ, 25 మార్చి (హి.స.)భారత రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. రైలు బయలుదేరే సమయాన్ని ఆధారంగా చేసుకుని రిఫండ్ విధానాన్ని సవరించింది. ఈ కొత్త మార్పులను రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రకటించారు. ఈ విధానం ఏప్రిల్ 1 నుంచి 15 వరకు దశలవారీగా అమల్లోకి రానున్నాయి.

కొత్త నిబంధనలు:

72 గంటల ముందు క్యాన్సిలేషన్: ప్రయాణానికి 72 గంటల ముందే కన్ఫామ్ టికెట్ రద్దు చేస్తే గరిష్ట రిఫండ్ లభిస్తుంది. అయితే కొంత క్యాన్సిలేషన్ ఛార్జీలు మినహాయించి మిగతా మొత్తాన్ని తిరిగి ఇస్తారు.

72 నుంచి 24 గంటల మధ్య: ఈ సమయంలో టికెట్ రద్దు చేస్తే ‘స్టాండర్డ్ పెనాల్టీ’ వర్తిస్తుంది. టికెట్ ధరలో సుమారు 25% కోత విధించి మిగిలిన మొత్తాన్ని రిఫండ్ చేస్తారు.

24 నుంచి 8 గంటల మధ్య: ఇది ‘లేట్ క్యాన్సిలేషన్’గా పరిగణిస్తారు. టికెట్ ధరలో 50% కోత విధించి మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇస్తారు.

8 గంటల లోపు లేదా ట్రైన్ బయల్దేరిన తర్వాత: ఈ సమయంలో టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్ ఉండదు.

ప్రయాణికులకు అదనపు సౌకర్యాలు:

బోర్డింగ్ పాయింట్ మార్పు: ఇప్పుడు ప్రయాణానికి 30 నిమిషాల ముందు వరకు బోర్డింగ్ స్టేషన్ను మార్చుకునే అవకాశం ఉంది.

కౌంటర్ టికెట్ క్యాన్సిలేషన్: ఇప్పటివరకు ట్రైన్ ప్రారంభ స్టేషన్లో మాత్రమే క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉండగా, ఇకపై ఏ స్టేషన్లోనైనా రద్దు చేసుకోవచ్చు.

TDR ఆటోమేటిక్ రిఫండ్: ఇ-టికెట్ కలిగిన ప్రయాణికులు ఇకపై మాన్యువల్గా TDR ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. నిబంధనల ప్రకారం ఆటోమేటిక్గా రిఫండ్ ప్రాసెస్ అవుతుంది.

ట్రావెల్ క్లాస్ అప్గ్రేడ్: కౌంటర్ టికెట్ ఉన్నవారు ప్రయాణానికి 30 నిమిషాల ముందు వరకు తమ క్లాస్ను అప్గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న క్యాన్సిలేషన్ ఛార్జీలు:

ఏసీ ఎగ్జిక్యూటివ్ / ఫస్ట్ క్లాస్: రూ.240 + GST

ఏసీ 2 టైర్: రూ.200 + GST

ఏసీ 3 టైర్ / ఛైర్ కార్: రూ.180 + GST

స్లీపర్: రూ.120

సెకండ్ క్లాస్: రూ.60

సమయం ఆధారంగా రిఫండ్ (పాత విధానం):

48 గంటల ముందు: ఫిక్స్డ్ ఛార్జీలు

48–12 గంటల మధ్య: 25% కోత

12–4 గంటల మధ్య: 50% కోత

4 గంటల లోపు: రిఫండ్ లేదు

మొత్తం మీద ఈ మార్పులు ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలిగించేలా, రిఫండ్ ప్రక్రియను సులభతరం చేసేలా రూపొందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande