
పటియాలా , 25,మార్చి (హి.స.)
పంజాబ్ (Punjab)లోని ఆప్ ఎమ్మెల్యే హర్మీత్సింగ్ పతన్మజ్రాను పోలీసులు అరెస్టు చేశారు. అత్యాచారం, మోసానికి సంబంధించిన కేసులో గతేడాది సెప్టెంబర్ నుంచి పరారీలో ఉన్న ఆయన్ను.. తాజాగా మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతన్ని పటియాలాకు తీసుకొస్తున్నామని.. ఇక్కడి కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.
పటియాలాలోని సనూర్ నియోజకవర్గానికి హర్మీత్ (Harmeet Singh Pathanmajra) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిరాక్పుర్కు చెందిన ఓ మహిళ ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదైంది. విడాకులు తీసుకున్నట్లు నమ్మించి హర్మీత్ తనతో సంబంధం కొనసాగించారని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత తనపై బెదిరింపులకు కూడా పాల్పడినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే గతేడాది సెప్టెంబరులో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. స్టేషన్కు తరలిస్తుండగా.. హర్మీత్, ఆయన సహాయకులు అధికారులపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. ఈ క్రమంలోనే హర్మిత్ను పట్టుకునేందుకు.. పోలీసులు గాలిస్తుండగా తాజాగా మధ్యప్రదేశ్లో పట్టుపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ