నల్లమల అడవుల్లో జీవిస్తున్న ఆదివాసీల స్థితిగతులపై అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆవేదన
హైదరాబాద్, 25 మార్చి (హి.స.) నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నల్లమల అడవుల్లో జీవిస్తున్న ఆదివాసీలు పూర్తిగా ఆర్థికంగా చితికిపోయి జీవనం కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. వారికి ప్ర
ఎమ్మెల్యే


హైదరాబాద్, 25 మార్చి (హి.స.)

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట

నియోజకవర్గం నల్లమల అడవుల్లో జీవిస్తున్న ఆదివాసీలు పూర్తిగా ఆర్థికంగా చితికిపోయి జీవనం కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. వారికి ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడం సాధ్యం కాదని.. కావున ప్రభుత్వమే ఒక ప్రత్యేక ఏజెన్సీ ద్వారా వారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే అచ్చంపేటకు నల్లమల్ల ముద్దుబిడ్డ సీఎం రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రి ఎన్నికల హామీల్లో భాగంగా 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అమ్రాబాద్ లో వంద పడకల ఆసుపత్రి మంజూరు చేయాలి. తెలిపారు.

ప్రధానంగా వైద్య విధాన పరిషత్ను సెకండ్ గ్రేడ్ వైద్య విధానంలోకి బిల్లును ప్రవేశ పెట్టినందుకు ఒక డాక్టర్గా సంతోషం వ్యక్తం చేస్తున్నానని, నేను పుట్టి పెరిగిన ప్రాంతం.. అమ్రాబాద్ మండల భౌగోళికంగా చాలా విస్తారమైన ప్రదేశమని ఆ ప్రాంతాల్లో ప్రజల జీవన విధానం, సుదూర ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు పొందడం కష్టతరంగా ఉందని ప్రస్తుతం ఉన్న వైద్య కేంద్రాన్ని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ మంజూరు చేయాలని కోరారు.

అలాగే.. గత ప్రభుత్వం ఆదరాబాదరగా అచ్చంపేట పట్టణ కేంద్రంలో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించారని ప్రధానంగా ఐసీయూ, సిటి స్కానింగ్ పరికరాలతో పాటు కావలసిన సిబ్బంది మౌలిక వసతులు సమకూర్చాలని సభాముఖంగా సంబంధిత మంత్రిని, ప్రభుత్వాన్ని కోరారు. వైద్యో నారాయణ హరి అనే నానుడి మాదిరిగా మెరుగైన వైద్య సేవలు ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలకు

అందించడానికి కృషి చేస్తుందని అందులో భాగంగా పల్లె బస్తీ దవాఖానలకు కూడా సిబ్బందిని నియమించాలని కోరారు.

నియోజకవర్గంలో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి మార్గం గుండా వారంలో రెండు మూడు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలకు గురైన వారిని సకాలంలో ప్రాథమిక వైద్య సేవలు అందేలా ట్రామా కేర్ సెంటర్ ను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటివరకు బేస్మెంట్ పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు అందరికీ కూడా డబ్బులు చెల్లించడం శుభ పరిణామం ఉన్నారు. అర్హులైన వారందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ సభలో స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే వంశీకృష్ణ తీసుకెళ్లారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande