'అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు'కు ఆమోదం.. హుజూరాబాద్లో న్యాయవాదుల హర్షం
హుజురాబాద్, 25 మార్చి (హి.స.) తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి ''అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు''కు ఆమోదం తెలపడం పై హుజూరాబాద్ న్యాయవాద లోకం హర్షం వ్యక్తం చేసింది. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ, టీపీసీసీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ జీడి రవితేజ ఆ
Advocate


హుజురాబాద్, 25 మార్చి (హి.స.) తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి 'అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు'కు ఆమోదం తెలపడం పై హుజూరాబాద్ న్యాయవాద లోకం హర్షం వ్యక్తం చేసింది. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ, టీపీసీసీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ జీడి రవితేజ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కోర్టు ప్రధాన ద్వారం వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై పెరుగుతున్న దాడులు, హత్యలు, పోలీసుల దౌర్జన్యాలను అరికట్టాలని న్యాయవాదులు పోరాడుతున్నారు. తమకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.

న్యాయవాదుల విన్నపాన్ని మన్నించి, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే మంత్రి మండలి ఈ బిల్లును ఆమోదించడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. హుజూరాబాద్ కోర్టు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులందరూ రాజకీయాలకు అతీతంగా ఏకమై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ బిల్లుతో న్యాయవాదులకు వృత్తిపరమైన భద్రత లభిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ముక్కెర రాజమౌళి, అరుణ్ కుమార్, నూతల శ్రీనివాస్, కనుక దేవయ్య, బండి రమేష్లతో పాటు జూనియర్ న్యాయవాదులు శివరామకృష్ణ, మోలుగురి విక్రమ్, ఎం. మౌనిక, కె. సౌమిత్ర, ఎండి యాస్మిన్, పత్తిపాక నాగరాజు, జి. హరిహరన్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande