ఇంధనం పై అసత్య ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు : ఆసిఫాబాద్ ఎస్పీ నితిక పంత్
కొమురం భీం ఆసిఫాబాద్, 25 మార్చి (హి.స.) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని జిల్లా ఎస్పీ నితిక పంత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మి.. వాహనదారులు ఎవరు ఆందోళన చెందాల
Asifabad SP


కొమురం భీం ఆసిఫాబాద్, 25 మార్చి (హి.స.)

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని

అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని జిల్లా ఎస్పీ నితిక పంత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మి.. వాహనదారులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసి.. ప్రజల్లో గందరగోళం సృష్టించే వారి పై జిల్లా పోలీస్ శాఖ నిఘా ఉందని. ఎలాంటి నిజనిర్ధారణ లేకుండా అసత్య ప్రచారం చేస్తే వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. ప్రజలు పుకార్లు నమ్మకుండా నిజా నిజాలు నిర్ధారణ చేసుకోవాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande