రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. డీలర్స్ అసోసియేషన్
హైదరాబాద్, 25 మార్చి (హి.స.) రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని తెలంగాణ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వినోద్ విశ్వనాద్, కోశాధికారి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఎలాంటి వదంతులను నమ్మవద్దని కోరారు
Dealers association


హైదరాబాద్, 25 మార్చి (హి.స.)

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని తెలంగాణ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వినోద్ విశ్వనాద్, కోశాధికారి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఎలాంటి వదంతులను నమ్మవద్దని కోరారు. రాష్ట్రం లో కొరత లేదని తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వదంతుల కారణంగా ప్రజలు ఆందోళనకు గురవుతూ, ఒకేసారి పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు వెళ్లి వాహనాల్లో ఫుల్ ట్యాంక్ నింపించుకోవడం వల్ల అనవసర రద్దీ, అంతరాయం ఏర్పడుతున్నదని తెలిపారు. అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా కూడా నిరంతరంగా కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ఎటువంటి కొరత పరిస్థితి లేదని, ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని సూచించారు. అలా చేయడం వల్ల ఇతరులకు అసౌకర్యం కలుగుతుందని తెలిపారు.

హెచ్పిసీఎల్, ఐ ఓ సి ఎల్, బి పి సి ఎల్ వద్ద ఫుల్ స్టాక్ ఉందన్నారు. వినియోగదారులు అవసరం మించి కొనుగోలు చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande