దక్షిణ అయోధ్య భద్రాద్రిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, 26 మార్చి (హి.స.) భక్త రామదాసు నిర్మించిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందింది. ఈ పవిత్ర క్షేత్రానికి దేశ విదేశాల నుంచి భారీగా భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమగ్ర
మంత్రి తుమ్మల


హైదరాబాద్, 26 మార్చి (హి.స.)

భక్త రామదాసు నిర్మించిన భద్రాచలం

శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందింది. ఈ పవిత్ర క్షేత్రానికి దేశ విదేశాల నుంచి భారీగా భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. గురువారం భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో నిర్వహించనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణం, మహా పట్టాభిషేకం ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించేందుకు విచ్చేయనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం సమన్వయంతో ప్రతి శాఖ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, వీఐపీలు, వీవీఐపీలు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మర్యాదపూర్వకంగా సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు.

శుక్రవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు స్వామివారి కల్యాణం, 28వ తేదీన అదే సమయాల్లో మహా పట్టాభిషేకం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.351 కోట్లను మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. స్వామివారి కల్యాణం అనంతరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. దేవాలయ అభివృద్ధితోపాటు భద్రాచలం పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

భక్తులకు మరింత సౌకర్యం కల్పించేందుకు రహదారులు, రైల్వే, నదీ మార్గాల అభివృద్ధి పై చర్యలు తీసుకుంటున్నామని, అమరావతి-జగదల్పూర్ మధ్య రవాణా సౌకర్యాల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. భద్రాచలాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకొని కరకట్టల ఎత్తు పెంపు, ఘాట్ల నిర్మాణం, రెండో పీట నిర్మాణం వంటి పనులు చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్తులో భక్తుల రాకను మరింత సులభతరం చేసే దిశగా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అనంతరం భద్రాచలం అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికల ఫోటోలను మంత్రి పరిశీలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande