డీజిల్, పెట్రోల్ పై సోషల్ మీడియాలో పుకార్లు.. బంకుల వద్ద పోటెత్తిన వాహనదారులు
హైదరాబాద్, 25 మార్చి (హి.స.) ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం కారణంగా ఇతర దేశాలకు ముడి సరుకుల రవాణా కొంత కష్టంగా ఉన్నది వాస్తవమే కానీ, మరింత దారుణ పరిస్థితులు లేవని సంబంధిత ఉన్నతాధికారులు ప్రజలకు ఎప్పటికప్పుడు ఆందోళన చెందవద్దని సమాచారం ఇస్తూనే ఉన్నార
డీజిల్ పెట్రోల్


హైదరాబాద్, 25 మార్చి (హి.స.)

ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం

కారణంగా ఇతర దేశాలకు ముడి సరుకుల రవాణా కొంత కష్టంగా ఉన్నది వాస్తవమే కానీ, మరింత దారుణ పరిస్థితులు లేవని సంబంధిత ఉన్నతాధికారులు ప్రజలకు ఎప్పటికప్పుడు ఆందోళన చెందవద్దని సమాచారం ఇస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా, ప్రధాన మీడియా మరియు ఇతర మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారు. అయితే ముఖ్యమైన ఉన్నతాధికారులు చెప్పిన విషయాలను గ్రహించకుండా, సోషల్ మీడియాలో అనామకులు, ఇన్ఫ్లుయెన్సర్లు వారి వ్యూస్ కోసం, స్వప్రయోజనాల కోసం ఉన్నదాన్ని లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా చూపిస్తూ పుకార్లు సృష్టిస్తున్నారు. వాటిని నమ్మి ప్రజలు పానిక్ అవుతూ, ఇతరులను కూడా ఆందోళనకు గురి చేస్తున్నారు.

ఇదే తరహాలో మొన్నటి వరకు గ్యాస్ కొరత అంటూ ప్రచారం జరగగా, ఇప్పుడు పెట్రోల్ కొరత అంటూ పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఈరోజే చివరి రోజు, ఇక పెట్రోల్ దొరకదు అనే వార్తలను నమ్మి ప్రజలు అవసరం లేకపోయినా పెట్రోల్ బంకుల వద్దకు చేరుకుంటున్నారు. ఉద్యోగాలకు వెళ్లేవారికి, అత్యవసర సేవల కోసం బయటకు రావాల్సిన వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి. పెట్రోల్ బంకుల వద్ద 2-3 కిలోమీటర్ల మేర కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు క్యూలలో నిలుస్తున్నాయి. అత్యవసరం లేకపోయినా ప్రజలు పెట్రోల్ కోసం బంకుల వద్దకు చేరుకుంటున్నారు. ఒక చోట అయితే భార్యాభర్తలు పెట్రోల్ తీసుకెళ్లడానికి సరైన డబ్బా లేకపోయినా స్టీల్ పాత్రలో పోసుకుని, తలపై పెట్టుకుని వెళ్లిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఇది వినడానికి నవ్వు తెప్పించినా, ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande