
సింహాచలం, 25 మార్చి (హి.స.)
బైకర్ చిత్రం ప్రచారంలో భాగంగా విశాఖ విచ్చేసిన ప్రముఖ కథానాయకుడు శర్వానంద్, కథానాయిక మాళవిక నాయర్, నిర్మాత శ్రీధర్ రెడ్డి మంగళవారం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. వారికి డిప్యూటీ ఈవో సింగం రాధ, పర్యవేక్షకుడు వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అధికారులు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు. సినీనటులను చూసేందుకు పలువురు భక్తులు ఆసక్తి చూపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ