దమ్ముంటే నాపై పోటీ చేయాలి : సీఎం రేవంత్కు హరీష్ రావు సవాల్
హైదరాబాద్, 25 మార్చి (హి.స.) బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలన, రాబోయే ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై ఆయన చేసిన కౌంటర్ అటాక్ రాజకీయ వర్గాల్లో హాట్
హరీష్ రావు


హైదరాబాద్, 25 మార్చి (హి.స.)

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి

హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలన, రాబోయే ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై ఆయన చేసిన కౌంటర్ అటాక్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని పగటి కలలు కంటున్నారని, ఆయన తల్లకిందులుగా తపస్సు చేసినా అది సాధ్యం కాదని ఎద్దేవా చేశారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఎప్పుడు, ఎలా గోల్ కొట్టాలో తమకు బాగా తెలుసని, సమయం వచ్చినప్పుడు తమ సత్తా చాటుతామని హరీష్ రావు హెచ్చరించారు.

వాళ్ళు వీళ్ళు ఎందుకు..? రేవంత్ రెడ్డికి దమ్ముంటే సిద్దిపేటలో నాపై పోటీకి రావాలి అని హరీష్ రావు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి ఇదే ఆఖరి టర్మ్ అని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు రైతులను కూడా రేవంత్ రెడ్డి మోసం చేశారని ధ్వజమెత్తారు. హామీలను అమలు చేయడంలో విఫలమైన రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన (Delimitation), మహిళా రిజర్వేషన్లను తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. పునర్విభజన వల్ల బీఆర్ఎస్ పార్టీకే మేలు జరుగుతుందని విశ్లేషించారు. అయితే.. కుటుంబ నియంత్రణను పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలకు

ఆర్థికంగా, రాజకీయంగా నష్టం జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారంపై స్పందిస్తూ.. ఆయన వస్తారో లేదో చూడటమే బాగుంటుంది, ఇప్పుడే చెప్పడం కంటే వేచి చూడటం ఉత్తమం అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande