జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన జగిత్యాల కలెక్టర్
జగిత్యాల, 25 మార్చి (హి.స.) జగిత్యాల జిల్లా వెల్గటూర్, ఎండపల్లి మండలాల్లో కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. ఉమ్మడి వెల్గటూర్ మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని మరియు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణా
Collector


జగిత్యాల, 25 మార్చి (హి.స.)

జగిత్యాల జిల్లా వెల్గటూర్, ఎండపల్లి

మండలాల్లో కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. ఉమ్మడి వెల్గటూర్ మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని మరియు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికల పనులను కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎండపల్లి, వెల్గటూర్ మండలాల్లో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎండపల్లి మండలం పాత గూడూరు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించి, పాఠశాల పరిస్థితులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను సమీక్షించారు. అనంతరం నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించి, పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

వెల్గటూర్ మండలం సంకెనపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అదేవిధంగా గ్రామ పంచాయతీ భవన నిర్మాణాన్ని కూడా సందర్శించి, పనులు సమయానికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వెల్గటూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)ను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ పథకాల అమలు విషయంలో ఎలాంటి అలసత్వం సహించబోమని, ప్రతి పనిని నాణ్యతతో పూర్తి చేసి ప్రజలకు ఉపయోగ పడేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande