
అమరావతి, 25 మార్చి (హి.స.):మద్యం కుంభకోణం కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో ఈ నెల 30వ తేదీన నిర్ణయం వెల్లడిస్తామని న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మంగళవారం ప్రకటించారు. కసిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ దవే, సిట్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ అగర్వాల్ వాదనలు వినిపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ