
న్యూఢిల్లీ, 25 మార్చి (హి.స.)
లోక్సభలో 2026 ఆర్థిక బిల్లుకు లోక్
సభ ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీ వేదికగా బుధవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో లోక్సభ 2026 ఆర్థిక బిల్లును (Finance Bill 2026) విజయవంతంగా ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 32 సవరణలతో కూడిన ఈ బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో, బడ్జెట్ ఆమోద ప్రక్రియలో లోక్సభకు సంబంధించిన కీలక భాగం పూర్తయినట్లయ్యింది. ఇక ఈ బిల్లు తదుపరి పరిశీలన కోసం ఎగువ సభ అయిన రాజ్యసభకు వెళ్లనుంది. రాజ్యసభ కూడా ఈ బిల్లును ఆమోదించిన తర్వాత, 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్ ప్రక్రియ అధికారికంగా ముగుస్తుంది. దేశ ఆర్థిక విధానాలు, పన్నుల రూపకల్పనలో ఈ బిల్లు ఆమోదం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..