డ్రమ్ములు, కంటైనర్లలో పెట్రోల్ నింపితే కఠిన చర్యలు : మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, 25 మార్చి (హి.స.) తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ దారుణంగా కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనాల రద్దీ అమాంతం పెరగడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్
లాంతరి ఉత్తమ్


హైదరాబాద్, 25 మార్చి (హి.స.)

తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్

దారుణంగా కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనాల రద్దీ అమాంతం పెరగడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ లో అయితే పరిస్థితి మరింత మారింది. ఫుల్ ట్యాంకులు చేయించుకోవడమే కాక.. డ్రమ్ములు, క్యాన్లు, కంటైనర్లలోనూ పెట్రోల్, డీజిల్ ను నింపుకుంటున్నారు. అవసరానికి మించి కొనుగోలు చేస్తుండటంతో బంకుల్లో ఇంధనం నిండుకుని నో స్టాక్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టవద్దని సూచించారు. రాష్ట్రంలో రెండు నెలలకు సరిపడా ఇంధన నిల్వలున్నాయని స్పష్టం చేశారు. డ్రమ్ములు, కంటైనర్లలో పెట్రోల్ నింపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా.. వాణిజ్య గ్యాస్ కు కొంత ఇబ్బంది ఉందన్నది వాస్తవమేనని, దీనిపై కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande