
హైదరాబాద్, 25 మార్చి (హి.స.)
తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం
ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్ మహానగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో కుండపోత వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు అత్యంత ప్రమాదకరమైన 'రెడ్ అలర్ట్' (Red Alert) ప్రకటించారు.
ఇప్పటికే హైదరాబాద్ నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం మళ్లీ మొదలైంది. వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్లో కొన్ని చోట్ల వడగళ్ల వర్షం (Hailstorm) కురుస్తోంది. అదేవిధంగా ఘట్కేసర్, పోచారం, అన్నోజిగూడ, నారపల్లిలో వర్షం మోస్తారుగా పడుతోంది. అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి కాకుండా మరికొన్ని జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన ఉంది. మరోవైపు మంచిర్యాల, నారాయణపేట్, వికారాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు 'ఆరెంజ్ అలర్ట్' (Orange Alert) జారీ చేశారు. ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో రాబోయే 2 నుంచి 3 గంటల్లో ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు