
నారాయణపేట, 25 మార్చి (హి.స.)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ వినియోగదారులకు కష్టాలు కొనసాగుతున్నవి. బుధవారం నారాయణపేట జిల్లాలోని నర్వ
మండల కేంద్రంలో ఇండియన్ గ్యాస్ గోదాం వద్ద ప్రజలు సిలిండర్ల కోసం భారీ క్యూ లైన్లతో నిలబడ్డారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు వేచి ఉన్న సిలిండర్లు దొరకడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా బుకింగ్ చేసుకున్న ఓటీపీలు రావడం లేదని ప్రజలు అంటున్నారు. కొంతమంది డబుల్ సిలిండర్లు ఉన్నప్పటికీ మళ్లీ సిలిండర్ల కోసం ఎగబడుతున్నారు. కొందరికి ఒకే సిలిండర్ ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకు సిలిండర్లు సరఫరా చేసే వ్యక్తులు డబుల్ సిలిండర్లు ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక్క సిలిండర్ ఉన్నవారికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలని కొందరు ప్రజలు కోరుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిలిండర్ల కొరత లేదని పదేపదే చెబుతున్న ప్రజలు మాత్రం సిలిండర్ల కోసం భారీ క్యూలైన్లలో నిలబడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..