ఈ-పాస్ పోర్టల్ లోపాలు.. విద్యార్థుల స్కాలర్షిప్లకు బ్రేక్!
హైదరాబాద్, 25 మార్చి (హి.స.) తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-పాస్ పథకం ప్రస్తుతం సాంకేతిక సమస్యల వలన తీవ్రంగా ప్రభావితమవుతోంది. ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలలు ఈ
Scholarship


హైదరాబాద్, 25 మార్చి (హి.స.)

తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-పాస్ పథకం ప్రస్తుతం సాంకేతిక సమస్యల వలన తీవ్రంగా ప్రభావితమవుతోంది. ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలలు ఈ సమస్యలతో తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ-పాస్ పోర్టల్లో ఆర్టీఎఫ్ బిల్లులు జనరేట్ చేసే సమయంలో “నో ఫీ అని చూపించడం వల్ల ప్రొసీడింగ్స్ రావడం లేదు. ఇదే సమయంలో కాలేజీ లాగిన్లలో బల్క్ ప్రింట్ ఆప్షన్ లేకపోవడం వల్ల బయోమెట్రిక్ పూర్తిచేసిన విద్యార్థుల వివరాలను జిల్లా సంక్షేమ శాఖకు సమర్పించడం సాధ్యపడడం లేదు.

అంతేకాకుండా, జిల్లా ఈపాస్ లాగిన్లలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన కోర్సులు, వాటికి సంబంధించిన ఫీజు వివరాలు కనిపించడం లేదు. దీనివల్ల బిల్లులు ప్రాసెస్ చేయడం పూర్తిగా నిలిచిపోయింది. బడ్జెట్ ఉన్నప్పటికీ, ఈ సాంకేతిక లోపాల వలన ఆర్థిక సహాయం విద్యార్థులకు చేరకుండా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. మరోవైపు, ప్రొసీడింగ్స్ జనరేషన్ సమయంలో ఐఎఫ్ఎస్సీ కోడ్లో పొరపాట్లు ఉన్నప్పటికీ, వాటిని సరిచేసే ఎడిట్ సదుపాయం లేకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది.

ప్రస్తుతం 2025–26 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న వేళ, ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే వేలాది మంది విద్యార్థులు తమ హక్కైన స్కాలర్షిప్ను కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ సైతం ఉపయోగించలేక సరెండర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది విద్యార్థులకే కాదు, విద్యాసంస్థలకు తీవ్రమైన నష్టం కలిగించే అవకాశం ఉంది. గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సమస్యలు విద్యార్థుల భవిష్యత్తు పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande