తెలంగాణ అసెంబ్లీలో డబుల్ బెడ్ రూం ఇళ్లపై చర్చ.. ఎవరేమన్నారంటే
99 రోజుల ప్రణాళికలో పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు కేటాయిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. బుధవారం అసెంబీలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూం ఇళ్లపై చర్చ జరిగింది.
Assembly


హైదరాబాద్, 25 మార్చి (హి.స.)99 రోజుల ప్రణాళికలో పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు కేటాయిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. బుధవారం అసెంబీలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూం ఇళ్లపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎన్ని ఉన్నాయి? వాటిలో ఎన్ని పూర్తయ్యాయి? ఇంకా ఎన్ని పూర్తి కావాల్సి ఉందనే దానిపై తమ వద్ద సమాచారం ఉందన్నారు. ఇంతలో ఎమ్మెల్యే కె. వెంకటరమణా రెడ్డి జోక్యం చేసుకుంటూ.. ఇందిరమ్మ ఇల్లు మంచి పథకమన్నారు.

వీటి వల్ల పేదలకు లబ్ది జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కట్టిన డబుల్ బెడ్ రూం ఇల్లు నాసిరకంగా ఉండడంతో శిథిలావస్థకు చేరాయని విమర్శించారు. ఇప్పటికే పూర్తయి ఎవరికి కేటాయించని డబుల్ బెడ్ రూం ఇళ్లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి జోక్యం లేకుండా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

గ్రేటర్ హైదరాబాద్లో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రశ్నించారు. ఇప్పటికే పూర్తయి.. ఎవరికీ కేటాయించని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వీలైనంత త్వరగా లబ్దిదారులకు అందజేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఖైరతాబాద్లో 5 ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టేందుకు శంకుస్థాపన చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించిందని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేశారు. చిన్న చిన్న రిపేర్ల కారణంగా వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇంకా లబ్దిదారులకు అందజేయలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీని దృష్టిలో పెట్టుకుని డబుల్ బెడ్ రూమ్లు ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం ఇందిరమ్మ కమిటీలు చెప్పే వారికే ఇళ్లు ఇస్తామంటున్నారని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande