విజయవాడ ఉగ్ర లింకుల.కేసులో మరొకరు.అరెస్ట్ అయ్యారు
అమరావతి, 25 మార్చి (హి.స.), :విజయవాడ ఉగ్ర లింకుల కేసులో మరొకరు అరెస్టయ్యారు. హైదరాబాద్ చంచల్గుడాకు చెందిన సయీదా బేగం అనే మహిళను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం సయీదా బేగంను టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించి.. విచారిస్తున్నారు. ఫ
విజయవాడ ఉగ్ర లింకుల.కేసులో మరొకరు.అరెస్ట్ అయ్యారు


అమరావతి, 25 మార్చి (హి.స.), :విజయవాడ ఉగ్ర లింకుల కేసులో మరొకరు అరెస్టయ్యారు. హైదరాబాద్ చంచల్గుడాకు చెందిన సయీదా బేగం అనే మహిళను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం సయీదా బేగంను టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించి.. విచారిస్తున్నారు. ఫారిన్ హ్యాండ్లర్ అల్ హకీమ్ షుకూర్ ద్వారా సోహైల్ బేగ్, షరీఫ్, డానిష్లు తీవ్రవాద సంస్థల వైపు వెళ్ళేలా ప్రోత్సహించడంలో సయీదా బేగం కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు.

మరోవైపు ఈ ఉగ్ర లింకుల కేసులో నిందితులు మహ్మద్ రెహ్మతుల్లా, మీర్జా సోహెల్, మహ్మద్ డానిష్లను మంగళవారం విజయవాడలోని సీఎంఎం కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. వారికి ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించారు. అనంతరం వారిని విజయవాడలోని జైలుకు తరలించారు.

పాకిస్థాన్లోని హ్యాండ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకొని సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ ముగ్గురిని విజయవాడ టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేసి.. వివిధ సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేశారు. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్తోపాటు పలు సామాజిక మాధ్యమాల ద్వారా యువతను ఉగ్రవాదం భావజాలం వైపు ఆకర్షిస్తున్నట్లు గుర్తించారు.

అలాగే ఉగ్రవాద చేరికలు, జిహాదీ కార్యకలాపాల కోసం అవసరమైన నిధులు వీరికి పాకిస్థాన్ హ్యాండ్లర్లు సమకూరుస్తున్నట్లు నిఘా వర్గాల వద్ద సమాచారం ఉంది. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా.. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని యువకులతో వీరు గ్రూప్లను ఏర్పాటు చేసి.. అందులో ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ.. ఉగ్రదాడులకు వారిని సన్నద్ధమయ్యేలా పురిగొల్పుతున్నట్లు విచారణలో వెల్లడైంది. అరెస్టయిన వీరందరిని లోతుగా విచారిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande