
కోల్కతా:/ఢిల్లీ, 25మార్చి (హి.స.) పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు- 2026 సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో కలిసి నడవాలని ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (ఏజేయూపీ) నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఒవైసీని తన ‘పెద్దన్న’ (బడా భాయ్)గా అభివర్ణించిన హుమాయున్ కబీర్.. రాబోయే ఎన్నికల్లో తాము కలిసి పోటీ చేస్తామని అధికారికంగా ప్రకటించి రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు.
తమ కూటమి వివరాలను వెల్లడిస్తూ 182 నుండి 192 స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు కబీర్ తెలిపారు. ‘నా పెద్దన్న అసదుద్దీన్ ఒవైసీ బెంగాల్ గడ్డపైకి వచ్చారు. ఏజేయూపీ, ఏఐఎంఐఎం కలిసి ఈ ఎన్నికల యుద్ధంలో తలపడతాయి. ఆయనను నా సొంత అన్నలా భావిస్తున్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కనీసం 20 భారీ ర్యాలీల్లో నాతో కలిసి పాల్గొంటారు’ అని అన్నారు. ఏప్రిల్ 1న బెహ్రంపూర్లో లక్షలాది మందితో నిర్వహించే తొలి సభకు ఒవైసీ స్వయంగా హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు.
3
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ