
ఢిల్లీ, 25 మార్చి (హి.స.) : దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కొరత ఉన్న సంగతి తెలిసిందే. ఈ సిలిండర్ల కొరత కారణంగా దేశ వ్యాప్తంగా ఉన్న హోటల్స్, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లన్నీ మూత పడిపోయాయి. యుద్ధం నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే సిలిండర్ల కొరత ఉన్న నేపథ్యంలో వంట గ్యాస్ బుకింగ్ రూల్స్ ను ఆయిల్ కంపెనీలు మరింత కఠిన తరం చేశాయి. డబుల్ సిలిండర్ ఉన్నవాళ్లు 35 రోజుల తర్వాతే రీఫిల్ బుక్ చేసుకోవాలని స్పష్టం చేశాయి.
అదే సమయంలో సింగిల్ సిలిండర్ ఉన్నవాళ్లు 25 రోజుల తర్వాత బుక్ చేసుకోవాలని సూచనలు చేశాయి ఆయిల్ కంపెనీలు. ఇక అటు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉన్న వినియోగదారులు మాత్రం ప్రతి 45 రోజులకు ఒక సిలిండర్ బుక్ చేసుకోవాలి. పట్టణ, గ్రామీణ ప్రాంత వాసులకు కూడా ఈ రూల్ వర్తిస్తుంది. రూల్స్ కు అనుకూలంగా బుకింగ్ చేసుకోకుండా, అంతకంటే ముందుగా గ్యాస్ బుకింగ్ చేస్తే సిస్టం ఆటోమెటిక్ గా బ్లాక్ చేస్తుందని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV