
తిరుమల, 25 మార్చి (హి.స.)
కలియుగ ఇలవైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 8 గంటల వరకూ 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి 4-6 గంటలు, రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శనం భక్తులకు 3-4 గంటల సమయం పడుతుందని టీటీడీ పేర్కొంది. నిన్న(మంగళవారం) శ్రీవారిని 78,381 మంది భక్తులు దర్శించుకోగా.. 25,451 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో హుండీ ఆదాయం.. రికార్డుస్థాయిలో రూ.4.46 కోట్లు సమకూరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV