ఆర్డీటీకి లైన్ క్లియర్.. మంత్రి నారా లోకేష్ కు మాంచో ఫెర్రర్ కృతజ్ఞతలు
అమరావతి, 25 మార్చి (హి.స.) దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది నిరుపేదలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ అండగా నిలుస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT)కి ఎదురైన నిధుల అడ్డంకులు తొలగిపోయాయి. విదేశీ నిధుల నియంత్రణ చట్టం (FCR
ఫెర్రర్


అమరావతి, 25 మార్చి (హి.స.)

దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది నిరుపేదలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ అండగా నిలుస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT)కి ఎదురైన నిధుల అడ్డంకులు తొలగిపోయాయి. విదేశీ నిధుల నియంత్రణ చట్టం (FCRA) కింద నిలిచిపోయిన నిధుల రాకను పునరుద్ధరించడంలో ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఈ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆర్డీటీ నిర్వాహకుడు మాంచో ఫెర్రర్ ఈ రోజు ఉండవల్లిలోని నివాసంలో మంత్రిని కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

గతంలో కేంద్ర ప్రభుత్వం ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) కింద కొన్ని నిబంధనల కారణంగా ఆర్డీటీకి విదేశాల నుంచి వచ్చే నిధులను నిలిపివేసింది. దీంతో సంస్థ నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. ఈ విషయాన్ని మాంచో ఫెర్రర్ గతంలోనే నారా లోకేష్ దృష్టికి తీసుకురాగా, లక్షలాది మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ అని లోకేష్ అభయమిచ్చారు. చెప్పినట్లుగానే కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపి, అడ్డంకులను తొలగించి నిధుల విడుదలకు మార్గం సుగమం చేశారు.

లోకేష్ను కలిసిన సందర్భంగా మాంచో ఫెర్రర్ మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక మంత్రికి చెబుతున్న కృతజ్ఞత కాదని, ఆర్డీటీ తరపున లక్షలాది మంది పేద ప్రజలు ఒక మంచి మనిషికి అందిస్తున్న ఆశీస్సులు అని భావోద్వేగంతో పేర్కొన్నారు. లోకేష్ తనదైన శైలిలో మంత్రాంగం నడిపి, అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేశారని కొనియాడారు. ఆర్డీటీ సేవలు నిరంతరాయంగా కొనసాగేలా చేయడంలో లోకేష్ చూపిన చొరవ అభినందనీయమని ఆయన అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande