
అమరావతి, 26 మార్చి (హి.స.)
, రాష్ట్రంలో పీఎం ఈ-బస్ సేవా పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఏపీ సచివాలయంలో బుధవారం రాష్ట్ర స్థాయి అనుమతుల కమిటీతో ఆయన సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం రాయితీ అందిస్తోన్న పీఎం ఈ-బస్ సేవా పథకంలో భాగంగా మొదటి దశలో 11 నగరాల్లో 750 విద్యుత్ బస్సులు ప్రవేశ పెట్టడంపై చర్చించారు. విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కాకినాడ, రాజమహేంద్రవరం, కడప, తిరుపతి, అనంతపురం నగరాల్లో ఈ-బస్సులు ప్రవేశ పెట్టే చర్యలు కొనసాగుతున్నాయని ఆర్టీసీ అధికారులు వివరించారు. తిరుపతిలో ఇప్పటికే 100 బస్సులు ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. 15 ఏళ్లు దాటిన బస్సులను పూర్తిగా తొలగించాలని సీఎస్ సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ