మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం , 12 మంది సజీవ దహనం
హరికృష్ణ ట్రావెల్స్ కి చెందిన బస్
మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం , 12 మంది సజీవ దహనం


మార్కాపురం, 26 మార్చి (హి.స.)

: మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్- ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. బస్సుతో పాటు టిప్పర్లోనూ మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోని 12 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరికొందరికి గాయాలయ్యాయి. ప్రమాదంతో బస్సు, టిప్పర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. గురువారం ఉదయం 6-6.30 గంటల మధ్య ఈ ఘోరం జరిగింది. ఘటనాస్థలికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మార్కాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

బస్సు హైదరాబాద్ నుంచి పామూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పలకల క్వారీల బస్సు మలుపు తిరుగుతుండగా టిప్పర్ ఢీకొట్టినట్లు సమాచారం. టిప్పర్ అతివేగమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వీరిలో బస్సు వెనుక భాగంలో ఉన్నవారు బయటకు రాలేక మృతిచెందినట్లు తెలుస్తోంది. ముందు భాగంలో ఉన్న సుమారు 10 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో కనిగిరి ప్రాంతానికి చెందిన వారు ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనాస్థలాన్ని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పరిశీలించారు.

ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు , రాష్ట్ర మంత్రి లోకేష్ ఘట్నా స్థలానికి బయలుదేరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మత్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం.ఘటనపై పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande