బస్సు ప్రమాదంలో 12 మంది సజీవదహనం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, కీలక ఆదేశాలు
అమరావతి, 26 మార్చి (హి.స.) : మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులోని ప్రయాణికులు సజీవదహనం కావడంపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదం
సీఎం చంద్రబాబు


అమరావతి, 26 మార్చి (హి.స.) :

మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులోని ప్రయాణికులు సజీవదహనం కావడంపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని సీఎంకు అధికారులు వివరించారు. మృతుల సంఖ్యపెరిగే అవకాశం ఉందన్న సమాచారంపై CM ఆందోళన చెందారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

టిప్పర్ను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొనడం, మంటలు చెలరేగి అందులోని ప్రయాణికులు సజీవదహనం కావడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి మార్కాపురం జిల్లా యంత్రాంగంతో ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన సుమారు 20 మందిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు వివరించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న సమాచారంపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రమాదానికి గల కారణాలపై తక్షణమే దర్యాప్తు జరిపి, పూర్తి నివేదిక అందజేయాలని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, మృతుల కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులకు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande