
తిరుమల , 26 మార్చి (హి.స.)
కలియుగ వైకుంఠం తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Queue Complex)లోని 30 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ప్రస్తుతం తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం లభించడానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ (TTD) సిబ్బంది నిరంతరాయంగా పాలు, తాగునీరు మరియు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. బుధవారం స్వామివారిని మొత్తం 73,411 మంది భక్తులు దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకోవడంలో భాగంగా 30,474 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారిపై భక్తులు తమ భక్తిని చాటుకుంటూ భారీగా కానుకలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే స్వామివారి హుండీ ఆదాయం రూ.4.43 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV