పార్లమెంట్లో డీలిమిటేషన్పై చర్చకు రావాలి.. కాంగ్రెస్కు ఎంపీ రఘునందన్ సవాల్
హైదరాబాద్, 26 మార్చి (హి.స.) నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లా
రఘునందన్ రావు


హైదరాబాద్, 26 మార్చి (హి.స.)

నియోజకవర్గాల పునర్విభజనతో

దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా రేవంత్ రెడ్డి ఒక మంచి లెక్కల టీచర్ను పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. ప్రస్తుతం డీలిమిటేషన్లో భాగంగా ఉన్న స్థానాల్లో సగం స్థానాలు పెరుగుతాయని స్పష్టత (Clarity) ఇచ్చారు.

ప్రధాని నరేంద్ర మోడీ మొదటి నుండి

(PM Naredra Modi) ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ గుడ్డిగా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. ఉత్తరాదిన జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ సీట్లు పెరుగుతాయని, దక్షిణాదిన సీట్లు తగ్గుతాయని.. ఇలా అర్థం లేని వాదనలు చేస్తున్నారని కామెంట్ చేశారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తామన్నా వ్యతిరేకించారని, ఇప్పుడు 50 శాతం స్వీట్లు పెంచుతామంటే ఒప్పుకోమంటున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే పార్లమెంట్లో చర్చకు రావాలని సవాల్ విసిరారు. డీలిమిటేషన్ అనేది ఎన్నికల అంశం కాదని, ఇప్పటికే దానిని పార్లమెంట్లో అన్ని పార్టీల దృష్టికి తీసుకువచ్చామని ఎంపీ రఘునందన్ రావు అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande