ఆరోగ్యశ్రీ బకాయిల విషయంలో విపక్షాల తప్పుడు ఆరోపణలు.. సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, 26 మార్చి (హి.స.) ఆరోగ్యశ్రీ బకాయిల విషయంలో విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మండిపడ్డారు. ఇవాళ ఆయన అసెంబ్లీలో ఆరోగ్యశ్రీపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ బిల్లులను గ్రీన్ ఛానల్ (Gre
సీఎం


హైదరాబాద్, 26 మార్చి (హి.స.)

ఆరోగ్యశ్రీ బకాయిల విషయంలో

విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మండిపడ్డారు. ఇవాళ ఆయన అసెంబ్లీలో ఆరోగ్యశ్రీపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ బిల్లులను గ్రీన్ ఛానల్ (Green Channel) ద్వారా విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెప్పిందని, కానీ చెప్పిన విధంగా విడుదల కావడం లేదని ప్రశ్నించిన హరీశ్రావుకు ఆయన సమాధానం ఇచ్చారు.

గత ప్రభుత్వం సుమారు రూ.600 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టిందని విమర్శించారు. అందులో ప్రభుత్వ ఎయిడెడ్ ఆస్పత్రులకు రూ.240 కోట్లు, ప్రైవేటు ఆస్పత్రులకు రూ. 360 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా సగటున రూ.89 కోట్లు ఖర్చు చేస్తూ, మొత్తంగా రూ. 2,408 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలను క్లియర్ చేశామని అన్నారు. అందులో ప్రభుత్వ ఎయిడెడ్ ఆస్పత్రులకు రూ.927 కోట్లు, ప్రైవేటు ఆస్పత్రులకు రూ. 1,480 కోట్లు చెల్లింపులు జరిగాయని వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande