
తిరుపతి, 27 మార్చి (హి.స.)
(తితిదే): తిరుపతిలోని శ్రీ కోదండ రామచంద్రస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీ రామ నవమి సందర్భంగా సందర్భంగా ఉదయం ఊంజల్ మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవరులకు స్పపన తిరుమంజనం వైభవంగా జరిగింది. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ