పశ్చిమ గోదావరి జిల్లా.ఆకివీడు మండలం పెద్దపేటలో ఉద్రిక్తత
ఆకివీడు, 27 మార్చి (హి.స.) : పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం పెద్దపేటలో ఉద్రిక్తత నెలకొంది. శిథిలావస్థకు చేరిన రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా పూజలు నిర్వహించేందుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెళ్లారు. ఆయన రాకను వ్యతిరేకిస్తూ.. దళిత సంఘాల
పశ్చిమ గోదావరి జిల్లా.ఆకివీడు మండలం పెద్దపేటలో ఉద్రిక్తత


ఆకివీడు, 27 మార్చి (హి.స.)

: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం పెద్దపేటలో ఉద్రిక్తత నెలకొంది. శిథిలావస్థకు చేరిన రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా పూజలు నిర్వహించేందుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెళ్లారు. ఆయన రాకను వ్యతిరేకిస్తూ.. దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. శిథిలావస్థకు చేరిన ఆలయం స్థానంలో నూతన గుడిని కట్టిస్తామని రఘురామ ఇటీవల ప్రకటించారు. అయితే, ఆ ప్రాంతంలో గుడి నిర్మించవద్దని, గొంతెనమ్మ ఆలయం కట్టాలని దళిత సంఘాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు శ్రీరామనవమి వేళ పూజలో కూర్చున్న రఘురామను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల సహకారంతో గుడి లోపలకి వెళ్లి పూజలు చేసిన తర్వాత... రఘురామ వెళ్లిపోయారు. అనంతరం రామాలయం కట్టాలంటున్నవారు.. వ్యతిరేకిస్తున్న దళితవర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకొని దాడులు చేసుకున్నారు. పోలీసులు వారిని అదుపు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande