డి లిమిటేషన్.. ఉమ్మడి నిజామాబాద్లో పెరగనున్న అసెంబ్లీ సీట్లు..
నిజామాబాద్, 26 మార్చి (హి.స.) ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న తొమ్మిది నియోజక వర్గాలకు అదనంగా మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్కన నిజామాబాద్ లో రెండు లేదా మూడు, కామారెడ్డి లో ఒకటి లేదా రెండు నియోజకవర్గాలు
Delimitation


నిజామాబాద్, 26 మార్చి (హి.స.)

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న తొమ్మిది నియోజక వర్గాలకు అదనంగా మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్కన నిజామాబాద్ లో రెండు లేదా మూడు, కామారెడ్డి లో ఒకటి లేదా రెండు నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలోని పలు మండలాలతో పాటు నిజామాబాద్ జిల్లా పరిధిలోని మోస్రా, వర్ని, కోటగిరి, చందూర్ మండలాలు కూడా ఉన్నాయి.

ఒక వేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే నిజామాబాద్ పరిధిలోని మండలాలు బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో నుండి వేరు చేసి బోధన్ నియోజకవర్గంలోని ఒకట్రెండు మండలాలను కలిపి కొత్తగా కోటగిరి నియోజకవర్గంగా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలోని కామారెడ్డి మున్సిపల్ పరిధితో పాటు కామారెడ్డి మండలం, శివారు గ్రామాలను కొన్నింటిని మున్సి పాలిటీలో విలీనం చేసి ప్రత్యేకంగా కామారెడ్డి అర్బన్ నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాచారెడ్డి, పాల్వంచ, దోమకొండ, బీబీపేట, భిక్కనూరు, రాజంపేట, రామారెడ్డి మండలాలతో కలిపి కామారెడ్డి రూరల్ నియోజకవర్గంగా ఏర్పాటయ్యే ఛాన్సుందనే ప్రచారం జరుగుతోంది.

జిల్లాలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లోని పరిధిలో భారీగా మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ అర్బన్ ను రెండుగా విభజించి నార్త్ సౌత్ గా ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని, ఆయా నియోజకవర్గాల పరిధిలోకి కొత్తగా కొన్ని మండలాలను కలిపే ఛాన్సుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..? కామారెడ్డి జిల్లాలో జుక్కల్ నియోజకవర్గం ప్రత్యేకంగా ఎస్సీ రిజర్వ్ డ్ సెగ్మెంట్ కాగా నిజామాబాద్ జిల్లాలో కూడా ఎస్టీ రిజర్వ్ డ్ నియోజకవర్గం ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande