ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు: అసెంబ్లీలో మంత్రి దామోదర రాజనర్సింహ!
హైదరాబాద్, 26 మార్చి (హి.స.) తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 9 లక్షల 45 వేల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodar Rajanarsimha) స్పష్టం చేశ
మంత్రి దామోదర


హైదరాబాద్, 26 మార్చి (హి.స.)

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్

ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 9 లక్షల 45 వేల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodar Rajanarsimha) స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ సందర్భంగా ఆరోగ్యశ్రీ బకాయిలు, సేవలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన వివరణాత్మక సమాధానం ఇచ్చారు. గతంలో ఏడాదికి సగటున 2.5 లక్షల మందికి మాత్రమే సేవలు అందగా, ప్రస్తుతం ఆ సంఖ్య 4 లక్షలకు చేరిందని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లింపులను భారీగా పెంచిందని, గత ప్రభుత్వ హయాంలో నెలకు సగటున రూ. 52 కోట్లు చెల్లిస్తే, ప్రస్తుతం నెలకు రూ.89 కోట్లు రెగ్యులర్గా చెల్లిస్తున్నామని మంత్రి వెల్లడించారు.

గత ప్రభుత్వం నుంచి వచ్చిన రూ.600 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు, రూ. 130 కోట్ల ఈహెచ్ఎస్ బకాయిలను కూడా క్రమంగా తగ్గిస్తూ వస్తున్నామని మంత్రి తెలిపారు. 2023 డిసెంబర్ 8 నుంచి ఇప్పటివరకు సుమారు రూ. 2400 కోట్లకు పైగా పేమెంట్స్ చేశామని, ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రులకు కేవలం రూ.250 కోట్ల బకాయిలు మాత్రమే ఉన్నాయని వివరించారు. ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలకు నిరాకరిస్తున్నాయన్న ప్రతిపక్షాల ఆరోపణలను ఆయన ఖండించారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి 330గా ఉన్న నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్య ఇప్పుడు 537కు పెరగడమే తమ పనితీరుకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ములుగు, నారాయణపేట వంటి మారుమూల జిల్లాల్లోనూ ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande