
హైదరాబాద్, 26 మార్చి (హి.స.)
దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సిద్దిపేటలో నాపై పోటీ చేయాలి అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) చేసిన సవాల్కు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. హరీశ్ రావు చిట్ చాట్ పేరిట బడాయి కబుర్లు, సొల్లు కబుర్లు చెబుతున్నారని ప్రభుత్వ విప్లు ఆది శ్రీను, వేముల వీరేశం ఫైర్ అయ్యారు. దమ్ముంటే రేవంత్ రెడ్డిని సిద్దిపేటకు వచ్చి పోటీ చేయమని మాట్లాడుతున్నారు. సిద్దిపేటలో రేవంత్ రెడ్డి కాదు, వారు బి-ఫాం ఇచ్చిన అభ్యర్థి రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొడుతారని ఆదిశ్రీను జోస్యం చెప్పారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ సిద్దిపేటలో (Congress) రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. తలకిందులు తపస్సు చేసిన మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాదని, కేసీఆర్ ముఖ్యమంత్రి కారన్నారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన రోజే ప్రజలు మీ పార్టీని ఫాం హౌస్ కు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు.
హరీశ్ రావు చిట్ చాట్ పేరుతో ఏవేవేవో మాట్లాడుతున్నారని వేముల వీరేశం విమర్శించారు. రేవంత్ రెడ్డి మిమ్మల్ని గద్దె దించుతాం అని చెప్పి మరీ గద్దె దించారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మిమ్మల్ని సున్నాకి పరిమితం చేస్తామని చేసి చూపిన దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. మీ పార్టీ అధ్యక్షుడు ఏక్కడా అని ప్రశ్నించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..