కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠాను పట్టుకున్న వికారాబాద్ పోలీసులు
వికారాబాద్, 26 మార్చి (హి.స.) కల్తీ వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టురట్టు చేశామని గురువారం వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర ఓ ప్రకటనలో వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ ఎస్కె.అన్వార్ పాషా, సి
Vikarabad SP


వికారాబాద్, 26 మార్చి (హి.స.)

కల్తీ వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టురట్టు చేశామని గురువారం వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర ఓ ప్రకటనలో వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ ఎస్కె.అన్వార్ పాషా, సిబ్బంది వినూత్న రీతిలో దాడులు నిర్వహించి, భారీ ఎత్తున విక్రయిస్తున్న కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠాను పట్టుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించిన పోలీసులు, సుమారు 600 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు. తాండూరులోని పాత కూరగాయల మార్కెట్ ప్రాంతానికి చెందిన రేపాల శ్రీధర్ (47) అనే వ్యక్తి కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ బృందం దాడి చేసి అతని వద్ద నుండి 40 కేజీల కల్తీ పేస్ట్ను స్వాధీనం చేసుకుంది.

విచారణలో భాగంగా, ఈ కల్తీ పదార్థాన్ని కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన యర్రమల్లి గిరిధర్ (40) అనే వ్యక్తి తయారు చేసి సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. వెంటనే మా బృందాలు బీదర్లోని అతని హోల్సేల్ షాపు పై దాడి చేసి, అక్కడ నిల్వ ఉంచిన మరో 560 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను సీజ్ చేశాయి అని తెలిపారు. ప్రస్తుతం నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, ఈ వ్యక్తులపైన కేసును నమోదు చేశామని తెలిపారు. కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయించే వారి పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఓ ప్రకటనలో హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande