
అమరావతి, 26మార్చి (హి.స.) ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం (Markapuram) జిల్లాలో పెను విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో మొత్తం 13 మంది ప్రయాణికులు బస్సులోనే చిక్కుకుపోయి సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రభుత్వం, సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు, బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు తక్షణమే ప్రత్యేక కంట్రోల్ రూమ్ (Control Room)ను ఏర్పాటు చేసింది. ప్రమాదానికి గురైన వారి వివరాలు, ఇతర సమాచారం 6304285613, 9985733999, 7989537285, 9703578434 కోసం కింది ఫోన్ నంబర్లను సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV