
న్యూఢిల్లీ, 26 మార్చి (హి.స.) ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అగ్నివీర్లకు 20 శాతం రిజర్వేషన్ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సిఫారసు చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. అటవీ గార్డులు, మైనింగ్ గార్డులు, పోలీసు కానిస్టేబుల్, అగ్నిమాపక సిబ్బంది, జైలు వార్డెన్, స్పెషల్ పోలీసు ఆఫీసర్, ఎన్డీఆర్ఎఫ్ తదితర నియామకాల్లో ఈ రిజర్వేషన్ అమలు చేయాలని ఆ లేఖలో సూచించారు. అగ్నివీర్ తొలి బ్యాచ్లో చేరిన వారు 2027లో తమ నాలుగేళ్ల సర్వీసును పూర్తి చేసుకోనున్నారు. అయితే, పోలీసు, మైనింగ్ గార్డులు, జైలు వార్డెన్, స్పెషల్ పోలీసు ఆఫీసర్, గ్రూప్-సీ నియామకాల్లో అగ్నివీర్లకు 20ు రిజర్వేషన్ అమలు చేస్తామని మొదట హరియాణా ప్రకటించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ