భారత్కు హోర్ముజ్ జలసంధి మార్గం క్లియర్: ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కీలక ప్రకటన
ఢిల్లీ, 26 మార్చి (హి.స.) వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా భారత్ సహా ఇతర స్నేహపూర్వక దేశాల నౌకల ప్రయాణానికి ఇరాన్ అనుమతినిచ్చింది. ఈ మేరకు ఇవాళ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కీలక ప్రకటన చేశారు. భారత్, చ
ిి


ఢిల్లీ, 26 మార్చి (హి.స.)

వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా భారత్ సహా ఇతర స్నేహపూర్వక దేశాల నౌకల ప్రయాణానికి ఇరాన్ అనుమతినిచ్చింది. ఈ మేరకు ఇవాళ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కీలక ప్రకటన చేశారు. భారత్, చైనా, రష్యా, ఇరాక్, పాకిస్థాన్ దేశాలకు చెందిన నౌకలు ఈ మార్గం ద్వారా ప్రయాణించవచ్చని ఇరాన్ తెలిపింది. ఈ మార్గంలో ప్రయాణించే శత్రుత్వం లేని నౌకలు (non-hostile vessels) తప్పనిసరిగా ఇరాన్ అధికారులతో ముందస్తు సమన్వయం చేసుకోవాలని ఇరాన్ రక్షణ మండలి స్పష్టం చేసింది. ఇరాన్పై దాడులకు మద్దతు ఇవ్వని, భద్రతా నిబంధనలను పాటించే నౌకలకు మాత్రమే ఈ రక్షణ కల్పిస్తామని ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపింది.

కాగా హర్మూజ్ జలసంధి మూసివేత వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్, ఎరువుల సరఫరాకు తీవ్ర విఘాతం కలుగుతోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇరాన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande