
అమరావతి, 27 మార్చి (హి.స.)
అమరావతి, ఒబెసిటీ ముక్త్ భారత్ - మిషన్ హెల్దీ భారత్ యాత్ర చేస్తున్న యంగ్ బైకర్ తాప్సీ ఉపాధ్యాయ, డిప్యూటీ సీఎం పవ న్ కల్యాణ్ను కలిశారు. గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఉత్తరప్రదేశ్లోని మేరఠ్కు చెందిన 23 ఏళ్ల తాప్సీ 2025 మార్చి 9 బైక్ యాత్ర ప్రారంభించారు. ఇప్పటి వరకూ 17,400 కిలోమీటర్ల ప్రయాణం చేసి, 500 పైగా విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆమె, పవన్కు వివరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, ఆమెను సత్కరించారు. కాగా, అంతకు ముందు వెలగపూడి సచివాలయంలో ఆమెను మంత్రి సత్యకుమార్ సత్కరించి, అభినందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ