ఇజ్రాయెల్ అమెరివనుద్దాం.సామాన్యుల పై ప్రభావం
అనంతపురం, 27 మార్చి (హి.స.) ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాలు చేపడుతున్న యుద్ధం సామాన్యులపై పెను ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా గ్యాస్ కష్టాలు అధికమయ్యాయి. హిందూపురం పట్టణంలో కమర్షియల్ సిలిండర్లు అందుబాటులో లేక వాటిపై ఆధారపడిన చిన్నచిన్న హోటళ్లు మూతపడ
ఇజ్రాయెల్ అమెరివనుద్దాం.సామాన్యుల పై ప్రభావం


అనంతపురం, 27 మార్చి (హి.స.)

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాలు చేపడుతున్న యుద్ధం సామాన్యులపై పెను ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా గ్యాస్ కష్టాలు అధికమయ్యాయి. హిందూపురం పట్టణంలో కమర్షియల్ సిలిండర్లు అందుబాటులో లేక వాటిపై ఆధారపడిన చిన్నచిన్న హోటళ్లు మూతపడుతున్నాయి. దీని వలన పరోక్షంగా వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. బ్లాక్లో వాణిజ్య సిలిండర్ రూ.4 వేల దాకా కొంటున్నామంటూ కొన్ని హోటళ్లు యజమానులు అల్పహారం, భోజనం ధరలను ఇష్టానుసారంగా పెంచేశారు. దీంతో పట్టణంలో రోజువారి కూలీలు హోటళ్లలో భోజనం తినాలంటే జంకే పరిస్థితి నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande