
హైదరాబాద్, 28 మార్చి (హి.స.)
అంబర్పేట్ ప్రాంతంలో నకిలీ (కల్తీ) ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్న ఓ ఫ్యాక్టరీ పై పోలీసులు, ఆహార భద్రత అధికారులతో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. బిస్కెట్లకు ఆకర్షణీయమైన రంగు, రుచి కలిగించేందుకు నిషేధిత, ప్రాణాంతక రసాయనాలను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, తక్కువ ఖర్చుతో ఉత్పత్తి పెంచేందుకు కుళ్ళిపోయిన, పాడైన గుడ్లను ఉపయోగిస్తున్నట్లు ఆధారాలతో సహా గుర్తించారు.
ఫ్యాక్టరీలో కనీస పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం, ఈగలు ముసురుతున్న మురికి వాతావరణంలోనే తయారీ కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితులు ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగించే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. ఈ ఘటన పై కేసునమోదు చేసి, ఫ్యాక్టరీ యజమాని పై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. స్వాధీనం చేసుకున్న ముడి సరుకులను ప్రయోగశాలకు పంపినట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు